నేటి నుంచి ఉద్యానవన కోర్సులకు కౌన్సెలింగ్

by Anukaran |
నేటి నుంచి ఉద్యానవన కోర్సులకు కౌన్సెలింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యవసాయ, ఉద్యాన కోర్సులకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్‌‌ను ఈ నెల 9 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ తెలిపారు. మొదటి కౌన్సెలింగ్‌కు హాజరుకాని విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చని ఆయన తెలిపారు. విద్యార్థుల ర్యాంకుల వివరాలు, ఇతర సమాచారం కోసం వర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.

రూ. 27 కోట్ల పనులకు ప్రారంభోత్సవం

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో దాదాపు రూ. 2.27 కోట్ల విలువైన పనులను వీసీ ప్రవీణ్‌రావు ప్రారంభించారు. రూ. 1.22 కోట్లతో ఏర్పాటుచేసిన ఆధునాతన గేట్‌ కాంప్లెక్స్‌, రూ.82.40 లక్షలతో ఆగ్రో ఫారెస్ట్రీ విభాగంలో ల్యాబ్‌ , సీడ్‌ రీసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌లో రూ.23.27 లక్షలతో నిర్మించిన మోడ్యులర్‌ సీడ్‌ గోడౌన్‌‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్‌, పరిశోధనా సంచాలకులు జగదీశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed