- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏఎన్ఎం రిక్రూట్ మెంట్‌లో అవినీతి.. ఆందోళనలో బాధితులు
దిశ, జనగామ: వైద్యశాఖలోని పలు ఖాళీలను పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా ఇటీవలే జనగామ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విడుదల చేసిన పలు పోస్టుల్లో అవినీతి రిక్రూట్ మెంట్ జరిగాయని పలువురు బాధితులు ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పై బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లా వ్యాప్తంగా 36 ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉండగా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ ఖాళీలోకి గాను 211 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కలెక్టర్ సమక్షంలో ఐదుగురు బృంద సభ్యులతో వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి ప్రైవేట్ కాంట్రాక్ట్ సోర్స్‌కి అప్పగించారు. ఈ అప్పగింతలోనే భారీ అవినీతి జరిగిందని బాధితులు ఆరోపించారు.
ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రోస్టర్ పద్ధతిలో మెరిట్ ప్రకారం అప్లికేషన్స్ పూర్తి చేయాల్సి ఉందని ఇవేమీ పాటించకుండా వారు ఇష్టారీతిన మెరిట్ తక్కువ ఉన్న వారికి సైతం ఆర్డర్ కాపీలు ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయనుకుంటే చదువుకున్న వారికి సైతం ఇటువంటి నమ్మకం లేకుండా పోతుందని, ఇలా అవినీతి అక్రమాలతో ఉద్యోగాలు ఇస్తూ పోతూ ఉంటే నిరుపేదలైన వారి పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ సంఘటనపై ప్రభుత్వం స్పందించకుంటే చట్టపరంగా న్యాయస్థానానికి వెళ్లి తేల్చుకుంటామని డిమాండ్ చేస్తూ రిక్రూట్ మెంట్ జరిగిన పద్ధతి పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని వినతిపత్రంలో కలెక్టర్ కి పేర్కొన్నారు. ఈ సంఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మహేందర్‌ను వివరణ కోరగా, అవినీతికి ఆస్కారం లేకుండా మా పద్ధతిలో మేము కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వారికి లిస్టులో పంపించామని, ఎక్కడైనా అవినీతి జరిగినట్లు ఉంటే వారి దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.