- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘తహసీల్దార్ లంచం అడుగుతున్నాడు.. మాకు న్యాయం చేయండి’
దిశ ప్రతినిధి, మెదక్: తెలంగాణ రెవెన్యూ శాఖలో అక్రమాల పరంపర కొనసాగుతూనే ఉంది. రెవెన్యూ డిపార్టుమెంట్‌లో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది నుండి ఉన్నతాధికారుల వరకు ఎవరిని కదలించినా.. ఫైళ్లు కదలాలంటే వారికి డబ్బులు ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. అంతలా రెవెన్యూలో అవినీతి పేరుకుపోయింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లా, మండల రెవెన్యూ శాఖల్లో ఇదే పరిస్థితి. తాజుగా.. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ఓ సంఘటనతో రెవెన్యూశాఖ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. వారసత్వ భూమిని పట్టా చేయాలని కోరినందుకు రూ. లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని, ఇస్తేనే పట్టా చేస్తానని తహసీల్దార్ బాధితులతో చెప్పాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు ధర్నా చేపట్టి నిరసన తెలిపిన సంఘటన నంగునూరు మండల పరిధిలో సిద్ధన్నపేట గ్రామంలో చోటుచేసుకుంది.
వారసత్వ భూమిని పట్టా చేయాలని బాధితుల ధర్నా..
సిద్ధన్నపేట గ్రామానికి చెందిన బాధితురాలు డాకూరి వెంకటవ్వ వివరాల ప్రకారం.. నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలో 1271,1252 సర్వే నెంబర్లలో 31 గుంటల భూమి ఉంది. ఆ భూమిని గత 25 ఏండ్లుగా వెంకటవ్వ కుటుంబం సాగుచేసుకుంటూ వస్తోంది. దీంతో ఆ భూమిని తమ పేరుపై పట్టా చేయాలని చాలామంది తహసీల్దార్‌లను వారు వేడుకున్నా.. ఇప్పటివరకూ ఎవరూ చేయలేదు. అయితే, అందులో 5 గుంటల భూమి గ్రామకంఠం లోనిదని.. అది కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ తహసీల్దార్ భూపతి తమకు కాకుండా.. ఇతరులకు పట్టా చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ‘‘మేము గత 25 సంవత్సరాల నుంచి సాగుచేసుకుంటున్నాము. ఆ భూమిని తమ పేరుపై పట్టా చేయాలని అడిగితే తహసీల్దార్ భూపతి రూ. లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని అడిగాడు. ఇస్తేనే పట్టా చేస్తానని లేకపోతే చేయను అని అన్నాడు.’’ అని బాధితురాలు వెంకటవ్వ ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిని తమకు ఇప్పించాలని వేడుకుంటోంది.
అవాస్తవమని చెప్పిన తహసీల్దార్..
లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నంగునూరు తహసీల్దార్ భూపతిని పలు మీడియా చానళ్లు(దిశమీడియా) వివరణ కోరగా.. తాను డబ్బులు డిమాండ్ చేసింది అవాస్తవం అని అన్నాడు. అంతేగాకుండా.. ఆ భూమి కోర్టు పరిధిలో ఉందని, వీరికి ఇల్లు లేదని.. అందుకే వేరే వారిపై పట్టా చేశామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికైనా అధికారులు, జిల్లా మంత్రి స్పందించి రెవెన్యూ శాఖపై దృష్టి పెట్టి అవినీతి అధికారులను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.