కరోనా కల్లోలం.. చేతులెత్తేసిన ప్రభుత్వం

by GSrikanth |   ( Updated:2022-12-25 07:13:04.0  )
కరోనా కల్లోలం.. చేతులెత్తేసిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: చాపకింద నీరులాగా మళ్లీ కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ముఖ్యంగా చైనాలో మళ్లీ విజృంభిస్తోంది. రోజుకు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రభుత్వం చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. కరోనా పేషెంట్లతో దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసుపత్రలున్నీ కిక్కిరిసిపోయాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కరోనా గణాంకాలు వెల్లడించబోమని ప్రకటించింది. మొదటి నుంచీ కరోనా కేసుల వివరాలను గోప్యంగా ఉంచి చైనా ప్రభుత్వం.. వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమైంది. ప్రస్తుతం బాధితుల సంఖ్య లక్షల్లో ఉండగా.. వేలల్లో ఉన్నట్లు చూపుతోందని సామాన్య ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా చైనా దక్షిణ ప్రాంతంలో ఉన్న డాంగ్వాన్ నగరంలో రోజుకు సగటున మూడు లక్షల కేసులు నమోదు అవుతున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. ఆ నగరంలో కోటికి పైగా జనాభా ఉన్నట్లు సమాచారం. ఇక కింగ్‌డావో నగరంలో రోజుకు 5 లక్షల 30 వేల వరకు కేసులు నమోదు అవుతున్నాయని లోకల్ మీడియా చెబుతోంది. దీనిని బట్టి చూస్తే కరోనా ఎంతవేగంతో దూసుకొస్తుందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని ఇతర దేశాల్లో నిబంధనలు విధించారు.

Also Read..

నెమ్మదిగా పెరుగుతున్న కరోనా.. కొత్త కేసులెన్నో తెలుసా?

Advertisement

Next Story