కరోనా ‘కవర్’.. రాదేమో నెవర్!

by sudharani |
కరోనా ‘కవర్’.. రాదేమో నెవర్!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కరోనా.. కరోనా.. ఏమిటీ నీ హైరానా.. దయ చూపవా కాస్తయినా.. మము వీడవా ఇకనైనా! అంటూ పేరడీ పాట అప్రయత్నంగానే ఓ ఆలాపనలా అందరి బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతోంది. ఎందుకంటే సమస్త ప్రపంచాన్ని చుట్టుముడుతున్న కరోనాతో ఆర్థిక వ్యవస్థలు ఏ విధంగా స్తంభించాయో చూస్తూనే ఉన్నాం. సరే ! ఆర్థిక పతనాలు, స్టాక్ మార్కెట్లు ఇవన్నీ సెకండరీ. ప్రధానంగా కరోనా వైరస్ జనజీవనాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందో కూడా చూస్తూనే ఉన్నాం. మాస్క్ లేనిదే బయటికి రావాలంటే జనం జంకుతున్నారు. విదేశీ ప్రయాణాలంటేనే హడలిపోతున్నారు. ఎయిర్‌పోర్టుల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు.

ఈ క్రమంలో కతార్‌లోని దోహాలో.. కరోనాను అడ్డుకునేందుకు జనాలు ధరిస్తున్న దుస్తులు మాత్రం ఆసక్తిని కలిగించడంతోపాటు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. శరీరమంతా కవర్ అయ్యేలా మాస్క్‌లాంటి దుస్తులు ధరించి, వాటర్ క్యాన్ అడుగు భాగాన్ని కత్తిరించి తలకు పెట్టుకుంటున్నారు. పైభాగం నుంచి గాలిపీలుస్తున్నారు. పెంపుడు జంతువులకు సైతం మాస్క్‌లు తొడుగుతున్నారు. టెక్నాలజీతో విశ్వంలోని రహస్యాలను ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న మనిషి, ప్రతిసారి అంతుచిక్కని వైరస్‌ల దాడితో అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే.
భారత్‌లో బుధవారం వరకు 28 పాజిటివ్ కేసులను గుర్తించినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ప్రజలకు సూచించారు.

Tags: corona, Qatar, Doha, Positive cases, Mask

Advertisement

Next Story