కర్ణాటక పీసీసీ అధ్యక్షుడికి కరోనా

by Anukaran |
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడికి కరోనా
X

బెంగళూరు: కరోనా మహమ్మారి ఎవ్వరినీ కూడా వదలడంలేదు. సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ వ్యక్తులకు కూడా కరోనా సోకుతుంది. చాలామంది ప్రముఖులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. చాలామంది దీని బారిన పడి మృత్యువాతపడిన విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్నే ఆయనే స్వయంగా వెల్లడించారు. తనతో కాంటాక్టులో ఉన్నవారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించించారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story