మరో 151 మంది పోలీసులకు కరోనా

by Anukaran |
మరో 151 మంది పోలీసులకు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. మరికొంతమంది పోలీసులకు కరోనా సోకింది. దీంతో మహారాష్ట్ర పోలీస్ శాఖలో కలకలం రేగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 151 మందికి కరోనా సోకింది. 5 మంది పోలీసులు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 14,792కు చేరింది. ఇందులో 11,867 మంది పోలీసులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 2,772 మంది పోలీసులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇప్పటివరకు మహారాష్ట్ర వ్యాప్తంగా 153 మంది కరోనా సోకి మృతిచెందారు.

Advertisement

Next Story