అమితాబ్, అభిషేక్‌కు కరోనా

by Anukaran |
అమితాబ్, అభిషేక్‌కు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడు హీరో అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లు ట్విట్టర్ లో పేర్కొన్నారు. కరోనా లక్షణాల కారణంగా టెస్టులు చేయించుకున్న వీరిద్దరికీ కరోనా సోకినట్లు నిర్ధారణ అయినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరితోపాటు కుటుంబ సభ్యులు కూడా ఐసోలేషన్ లోనే ఉన్నారు. అమితాబ్ భార్య జయా బచ్చన్ కు, అభిషేక్ భార్య ఐశ్వర్యరాయ్ నెగెటివ్ గా నిర్ధారణ అయ్యిందని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed