జీహెచ్ఎంసీలోనే మళ్లీ పది

by Shyam |
జీహెచ్ఎంసీలోనే మళ్లీ పది
X

• కొత్త కరోనా కేసులన్నీ రాజధానిలోనే

దిశ, న్యూస్‌బ్యూరో : తెలంగాణలో కరోనా కేసుల నమోదు స్థిరంగా కొనసాగుతోంది. శనివారం 10 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1132కు చేరింది. ఈ వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన 10 కేసులు ఇప్పటికే రెడ్‌జోన్‌గా ఉన్న రాజధాని నగరం హైదరాబాద్‌లోనే రికార్డవడం నగర వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 34గా ఉండగా వీరితో కలిపి ఇప్పటివరకు మొత్తం 727 మంది డిశ్చార్జయ్యారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 376గా ఉంది. శనివారం కరోనా మరణాలేవీ నమోదవలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారి సంఖ్య 29గా ఉంది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు నమోదుకాకపోవడం ఊరట కలిగిస్తోంది. ఇక వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.

Tags: telangana, coronavirus, cases, saturday, Hyderabad

Advertisement

Next Story