ఏలూరులో కరోనా అనుమానిత కేసు

by srinivas |   ( Updated:2020-03-15 22:16:31.0  )
ఏలూరులో కరోనా అనుమానిత కేసు
X

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కరోనా అనుమానిత కేసు నమోదైంది. కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని ఆచవరానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇటీవల సదరు వ్యక్తి హైదరాబాద్ కు వెళ్లివచ్చాడు. అప్పటి నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో బాధితుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నారు.

Advertisement

Next Story