పోలీస్‌శాఖలో కరోనా సెకండ్ వేవ్ కలకలం

by Shyam |
పోలీస్‌శాఖలో కరోనా సెకండ్ వేవ్ కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీస్‌శాఖలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నలుగురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు రెండోసారి కరోనా పాజిటివ్ నిర్థారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. గత జూన్‌ నెలలో కరోనా బారిన పడి కోలుకున్న వారు మళ్లీ ఇప్పుడు వైరస్‌ బారిన పడటంతో భయం మొదలైంది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతున్నప్పటికీ మళ్లీ ఇప్పుడు సేకండ్ వేవ్ కొంత కలకలం రేపుతోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారి పట్ల ప్రభుత్వం కేర్ తీసుకుంటున్నా, ముఖ్యంగా పోలీసులకు రెండోసారి కరోనా సోకడంతో భయానికి గురవుతున్నారు.

Advertisement

Next Story