ఏపీ డిప్యూటీ సీఎంకు కరోనా

by srinivas |
ఏపీ డిప్యూటీ సీఎంకు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. సామాన్య ప్రజల నుంచి ప్రజాప్రతినిధులను సైతం కరోనా భయపెడుతోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శుక్రవారం కడప జిల్లాలో టెస్టులు చేసుకోగా అతని భార్య, కుమార్తెకు కూడా వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన డీప్యూటీ సీఎం అదే రాత్రి ఒంటిగంటకు ఫ్యామిలీతో సహా చికిత్స నిమిత్తం తిరుపతిలోని కొవిడ్ ఆస్పత్రికి చేరుకున్నారని స్విమ్స్ డైరెక్టర్ భూమా వెంగమ్మ తెలిపారు. అనంతరం ఆదివారం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లినట్లు ఆమె స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed