బిడ్డకి జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ తల్లి… బిడ్డ నెగెటివ్?

by vinod kumar |
బిడ్డకి జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ తల్లి… బిడ్డ నెగెటివ్?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎయిమ్స్ న్యూఢిల్లీలో కరోనా పాజిటివ్‌గా నిర్ధరించిన తల్లి ఒకావిడ మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన పదిరోజులకు బిడ్డకు కరోనా పరీక్ష చేయగా నెగెటివ్ అని వచ్చింది. దేశంలో మొదటిసారిగా కరోనా పాజిటివ్ మహిళకు పుట్టిన బిడ్డగా ఈ బిడ్డ రికార్డు సృష్టించింది. అయితే బిడ్డకు నెగెటివ్ రావడంతో బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా కరోనా వస్తుందా లేదా అనే అంశం గురించి డాక్టర్లు ఒక నిర్ధరణకు వచ్చే అవకాశం దొరికింది.

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న సమయంలో బిడ్డ తల్లిదండ్రులు ఇద్దరికీ, మరో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ కరోనా పాజిటివ్‌గా తేలడంతో వారిని ఎయిమ్స్‌లో చేర్చారు. ప్రస్తుతానికి తల్లికి పాజిటివ్ లక్షణాలు రెండో దశలో ఉన్నప్పటికీ బిడ్డ మాత్రం ఆరోగ్యంగా ఉందని ఎయిమ్స్ గైనకాలజీ డాక్టర్ డాక్టర్ నీరజ తెలిపారు. ఇది చాలా అరుదైన కేసు కాబట్టి భవిష్యత్తు పరిశోధనల కోసం రికార్డు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం కొవిడ్ 19 పాజిటివ్ తల్లి, బిడ్డలకు పాలు ఇవ్వొచ్చు. కానీ పాలిచ్చే సమయంలో సరైన శుభ్రత పాటించాలి. ముఖానికి గుడ్డ కట్టుకుని బిడ్డకు శ్వాస తగలకుండా చూసుకోవాలి. వీటన్నింటిని తాము అనుసరిస్తున్నట్లు ఎయిమ్స్ వైద్యులు తెలియజేశారు.

Tags: AIIMS, Delhi, COVID 19, breast feeding, mother to son, corona positive

Advertisement

Next Story

Most Viewed