హరీష్ రావుకు కరోనా పాజిటివ్

by Anukaran |
హరీష్ రావుకు కరోనా పాజిటివ్
X

దిశ ప్రతినిధి, మెదక్: తెలంగాణాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అనేక మంది ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లని టెస్ట్‌లు చేయించుకోమని మంత్రి కోరారు. ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ స్టాఫ్, ఎమ్మెల్యే లకు, మీడియా ప్రతినిధులకు కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు.

ఈరోజు అసెంబ్లీలో టెస్ట్ చేపించుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డికి, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోవిడ్ రిపోర్ట్ నెగటివ్ రాగా మంత్రి హరీష్ రావుకు మాత్రం కరోనా పాజిటివ్ అని వచ్చింది. నిన్న ప్రగతి భవన్‌లో సీఎం మంత్రులతో అసెంబ్లీ సమావేశాలపై చర్చలో పాల్గొన్నారు. అయితే జూన్ నెలలోనే తన పీఏకి కరోనా సోకగా హరీష్ రావు హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. సిద్దిపేటలోని ఆయన నివాసంలోని ఓ వ్యక్తిగత సహాయకుడికి కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్పుడు మంత్రి హరీష్ రావు హైదరాబాద్‌లోని తన నివాసంలో స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు.

Advertisement

Next Story