కన్నడ హీరో, ఆయన భార్యకు కరోనా

by Shyam |
కన్నడ హీరో, ఆయన భార్యకు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా ఇండస్ట్రీ పైనే కాకుండా కరోనా ప్రభావం సినిమా హీరోలు, వారి కుటంబాలపై కూడా పడుతుంది. ఇప్పటికే బిగ్ బీ ఫ్యామీలీ కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా కన్నడ హీరో ధృవ్‌ సర్జాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన సతీమణి ప్రేరణకు కూడా వైరస్ సోకినట్లు తన ట్విట్టర్ అకౌంట్‌లో ధృవ్ వెల్లడించారు. గత కొద్ది రోజులు లక్షణాలు ఉండడంతో.. టెస్టులు చేయించుకుంటే పాజిటివ్‌ వచ్చిందని తెలిపాడు. ప్రజలందరూ తప్పని సరిగా మాస్కులు ధరించాలని.. లక్షణాలు ఉంటే టెస్టులు చేయించుకోవాలని ధృవ్ ట్విటర్ వేదికగా కోరారు.

Advertisement

Next Story