కొంపముంచిన భజన.. 21 మందికి కరోనా

by srinivas |
India daily corona cases
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా జిల్లాలోని తొండంగిలో కరోనా కలకలం రేపింది. ఒకే కుటుంబంలో ఏకంగా 21 మందికి కరోనా సోకింది. ఇటీవల ఓ కుటుంబం ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత మరో నాలుగు కుటుంబాలతో కలిసి ఇంట్లో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే.. వీరిలో కొందరికి జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. మొత్తం 21 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు వీరిని కలిసిన వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆ గ్రామంలో శానిటైజేషన్‌‌ను చేపట్టారు. పారిశుధ్య పనులు చేపట్టారు. ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్‌ల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story