- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా సోకిందని వెలి.. ఒకరు మృతి మరొకరు..
దిశ, వెబ్ డెస్క్ : సమాజంలో రోజరోజుకు మానవత్వం మంటకలిసిపోతోంది. బంధాలు, అనుబంధాలను మరిచి అమానవీయంగా మారుతున్నారు. రక్తసంబంధాలు అని కూడా చూడకుండా ప్రవర్తిస్తున్నారు. ఎవరి ప్రాణమైన ఎప్పటికైనా పోయేదే అని తెలిసి కూడా తమ ప్రాణమే ముఖ్యమనే భ్రమల్లో జీవిస్తూ తోబుట్టువులను కూడా దూరం చేసుకుంటున్నారు.
అనంతపురం జిల్లా ముప్పలకుంటలో కరోనాతో మృతిచెందిన వ్యక్తిని తాకాడంటూ గ్రామస్తులు నాగన్న అనే యువకుడిని గ్రామం నుంచి వెలేశారు. అవమానకర దుశ్చర్యకు గ్రామస్తులు పాల్పడడంతో మనస్థాపం చెందిన నాగన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన మరో ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. కరోనా సోకిన వ్యక్తికి మానసిక ధైర్యం కల్పించాల్సిన కన్నవారే కాదనుకున్నారు. తన కుటుంబంలోని యువకుడికి కరోనా సోకిందని కుటుంబ సభ్యులే ఇంట్లోకి రానివ్వకపోవడంతో గురువారం సాయంత్రం 3 గంటల నుంచి ఆ యువకుడు ఆరుబయటనే పడిగాపులు కాస్తున్నాడు.