- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇందులో కొత్తేముందనుకుంటే పొరపడినట్లే..!
దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా సమయంలో చేసే వివాహాలు, విందులు, ఇతర వేడుకలపై శానిటైజేషన్ ప్రభావం పడుతోంది. కరోనా ఉధృతి కారణంగా ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు ఇచ్చే అనుమతులపై ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివాహం, పుట్టిన రోజు, ఇతరత్రా వేడుకలు నిర్వహించుకునేందుకు గాను షరతులతో కూడిన అనుమతులను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఫంక్షన్ హాల్, కాన్ఫరెన్స్ హాళ్ల నిర్వాహకులు కూడా తమ ట్రెండ్ ను మార్చారు. హాల్ కావాలని వచ్చే వారిని ముందుగా ఎంత మంది విందుకు హాజరౌతున్నారనేది నిర్ధారించుకుని అద్దెకు ఇస్తున్నారు. ఇది అంతటా జరిగేదే కదా ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా ? ఇక్కడే ఉంది ట్విస్ట్. వివాహాలు, విందులు చేసే వారు హాల్ అద్దెతో పాటు శానిటైజేషన్ కోసం శానిటైజర్ చార్జీలు కూడా భరించవలసి ఉంటుంది. లేని పక్షంలో హాల్ ఇవ్వబోమని ఖరాకండిగా ఫంక్షన్ హాల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితులలో వాటికి కూడా అదనంగా డబ్బులు చెల్లించి విందులు చేసుకోవడం పరిపాటిగా మారింది.
శానిటైజర్ చార్జీలు అదనం…
ఫంక్షన్ హాల్, కాన్ఫరెన్స్ హాల్ లు వివాహాది విందుల కోసం అద్దెకు తీసుకునే వారు కరోనా బారిన పడకుండా యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యలు స్వాగతించే విధంగా ఉన్నప్పటికీ ఫంక్షన్లు నిర్వహించే వారిపై అదనంగా భారం పడుతోంది. ఏదేని వివాహం లేదా విందుకు 100 మంది హాజరౌతున్నారంటే వారిపై శానిటైజర్ చార్జీలు సుమారు రూ 10 వేల వరకు అదనపు భారం పడుతోంది. దీని కింద హాల్స్ యాజమాన్యం ఫంక్షన్ కు హాజరయ్యే ప్రతి ఒక్కరికి మాస్కులు అందజేస్తారు. అంతేకాకుండా నాణ్యమైన శానిటైజర్ ను వచ్చే వారికి అందజేసి చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తారు. దీంతో పాటు హాల్ లోని కుర్చీలను. స్టేజి పై కూడా శానిటైజర్ తరచుగా స్ప్రే చేస్తారు. విందుకు హాజరయ్యే ప్రతి ఒక్కరికి విధిగా జ్వరం ఉందా అని థర్మామీటర్ యంత్రం ద్వారా పరీక్షిస్తారు. ఒకవేళ ఫంక్షన్ కు హాజరయ్యే వారికి 100 ఫారన్ హీట్ డిగ్రీ దాటి శరీరం వేడిగా ఉంటే లోనికి అనుమతించరు. దీంతో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారు ఫంక్షన్ కు హాజరయ్యే అవకాశం తగ్గుతుంది.