- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వికారాబాద్ జిల్లాలో కరోనా తగ్గుముఖం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మూడు, నాలుగు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనాపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్, వికారాబాద్, గద్వాల్, సూర్యాపేట జిల్లాల్లో కరోనా కేసుల ఎక్కువగా నమోదు కావడంతో సీఎం కేసీఆర్ ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. అందులో భాగంగానే అదనంగా ఒక ఉన్నత స్థాయి అధికారిని సైతం నియమించారన్నారు. సీఎం కేసీఆర్ కరోనా నివారణపై ప్రతీ క్షణం సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. దీంతో తెలంగాణలో పరిస్థితి అదుపులో ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
Tags: Sabitha Indra Reddy, Review, Corona, declined, vikarabad