కరోనా మృతదేహానికి ఎమ్మెల్యే సీతక్క అంత్యక్రియలు..

by Sumithra |
కరోనా మృతదేహానికి ఎమ్మెల్యే సీతక్క అంత్యక్రియలు..
X

దిశ, ములుగు : కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే ములుగు ఎమ్మెల్యే సీతక్క మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ములుగు మండలం జగ్గన్న పేట గ్రామానికి చెందిన కట్కోజు సదానందం కరోనాతో మృతి చెందగా ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తిచేశారు.

కొవిడ్‌తో మరణించిన ఇంటిపెద్ద కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యంతో ఉండటంతో వారు అంత్యక్రియలు చేయలేని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న సీతక్క అంత్యక్రియలు జరిపించేందుకు ముందుకు వచ్చారు. అనంతరం ఈ ఏరియా మొత్తం దగ్గరుండి శానిటైజ్ చేయించారు.

Advertisement

Next Story