తెలంగాణలో కొత్తగా 682 పాజిటివ్ కేసులు

by Shyam |
తెలంగాణలో కొత్తగా 682 పాజిటివ్ కేసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో 682పాజిటివ్ కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,74,540కి చేరగా మృతుల సంఖ్య 1,477గా ఉంది. ప్రస్తుతం 7,696 యాక్టివ్ కేసులు ఉండగా ఇళ్లలోనే 5,634మంది బాధితులు ఉన్నారు. చికిత్స నుంచి కోలుకుని 2,65,367 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం జారీ చేసిన బులిటెన్​ లో ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 119 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 24, జగిత్యాల జిల్లాలో 22, కరీంనగర్​ జిల్లాలో 30, ఖమ్మం జిల్లాలో 38, మంచిర్యాలలో 28, మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో 64, నల్లగొండ జిల్లాలో 31, రంగారెడ్డి జిల్లాలో 47, వరంగల్​ అర్బన్​ జిల్లాలో 41 కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story