సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదు

by vinod kumar |   ( Updated:2021-03-17 10:50:51.0  )
సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఓవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా నానాటికీ పెరిగిపోతోంది. మొన్నటివరకు ముంబై, పూణె, బెంగళూరు వంటి నగరాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా కనిపించినా, ప్రస్తుతం దేశంలోని ప్రధాన పట్టణాలు, గ్రామాల్లో సైతం కేసుల సంఖ్య పెరుగుతోంది.

తాజాగా దేశరాజధాని ఢిల్లీలో ఒక్కరోజులోనే 500లకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం రిలీజైన హెల్త్ బులెటెన్ ప్రకారం.. ఢిల్లీలో 536 మంది కరోనా బారిన పడ్డారు. 1 జనవరి 2021 నుంచి పోలిస్తే ఇదే అత్యధికమని వైద్యులు వెల్లడించారు. దీంతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 6,45,025 చేరగా, గడచిన 24గంటల్లో వైరస్‌ సోకి చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.

Advertisement

Next Story