ధారావిలో కరోనా కేసులు తగ్గుముఖం!

by Shamantha N |
ధారావిలో కరోనా కేసులు తగ్గుముఖం!
X

ముంబై: దేశ ఆర్థిక రాజధాని మహరాష్ట్రలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా ముంబైలోని ధారావిలో ఇన్ని రోజులు వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా వ్యాప్తి నివారణకు మహా సర్కార్ కఠిన చర్యలు చేపట్టినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. అయితే శనివారం సాయంత్రం వెలువడిన హెల్త్ బులెటిన్ ప్రకారం ధారావిలో అతి తక్కువగా 7కేసులు మాత్రమే వచ్చినట్టు వైద్య శాఖ తెలిపింది.అంతేకాకుండా గత నాలుగు వారాలుగా ధారావిలో కొవిడ్-19 కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు అధికారులు వెల్లడించారు. జూన్ 6న అతి తక్కువగా 10 కేసులు తేలగా, ఈ రోజు 7 కేసులు అత్యల్పంగా వెలుగు చూశాయి.

Advertisement

Next Story