న్యూఫార్మెట్‌లో తెలంగాణ కరోనా బులెటిన్

by Anukaran |   ( Updated:2020-07-26 00:59:41.0  )
న్యూఫార్మెట్‌లో తెలంగాణ కరోనా బులెటిన్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. దాని కోరలతో రాష్ట్ర ప్రజలను కాకవికలం చేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా ఆదివారం తెలంగాణ ప్రభుత్వం తాజాగా సరికొత్త ఫార్మెట్ లో హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది.

తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,593 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య 54,059కు చేరింది. ఇందులో 41,332 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 12,264 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకి 463 మంది మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,53,425 కరోనా టెస్టులు నిర్వహిస్తే.. ఇందులో 15,654 టెస్టులు గడిచిన 24 గంటల్లో నిర్వహించినట్లు ప్రభుత్వం పేర్కొన్నది.

Advertisement

Next Story

Most Viewed