- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీతాలు పెంచండి.. ఇన్వెంటివ్స్ చెల్లించండి
దిశ ప్రతినిధి, ఖమ్మం: జీతాలు పెంచాలని, కరోనా ఇన్సెంటివ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు శుక్రవారం సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తుమ్మ విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సుమారు 250 పైగా కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో స్వీపర్లు పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్స్, దోబీ వర్కర్లుగా పనిచేస్తున్నారు. వీరికి గత నాలుగేండ్లుగా కేవలం రూ.7200 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేనద వ్యక్తం చేశారు. నిత్యం కరోనా పేషెంట్ల దగ్గర సేవ చేస్తున్న కార్మికులకు సరైన రక్షణ పరికరాలు ఇవ్వకుండా ఆరోగ్యం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వారికి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు అందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని కరోనా సోకిన కార్మికులకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి వారికి వైద్యం అందించాలని వారు కోరారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాలతికి వినతిపత్రం అందజేశారు.