కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడవద్దు : బల్మూరి వెంకట్

by Shyam |
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడవద్దు : బల్మూరి వెంకట్
X

దిశ, జమ్మికుంట : కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ అన్నారు. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో గురువారం ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడారు. కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని, ప్రతీ ఒక్కరికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు, కార్యకర్తల సమస్యలు తెలుసుకొని కష్టపడే వారికి పార్టీలో కచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.

హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ఈటల కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ చేసిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న భయంతోనే బీజేపీ, టీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ నాయకుల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారని, కచ్చితంగా హుజురాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story