కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు అరెస్ట్

by Sridhar Babu |   ( Updated:2020-07-26 02:21:16.0  )
కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు అరెస్ట్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఛలో మల్లారం కార్యక్రమానికి పోలీసులు అడ్డుకట్ట వేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా చలో మల్లారం కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ముందస్తు చర్యగా 144 సెక్షన్ విధించారు. మల్హర్ మండలం మల్లారం గ్రామానికి చెందిన దళితుడు రెవెల్లి రాజబాబును కొట్టి చంపడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఛలో మల్లారం కార్యక్రామనికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు కూడా చలో మల్లారం కార్యక్రామం చేపట్టారు. ఇరు పార్టీలు కూడా ఆదివారం రోజునే ఈ కార్యక్రమానికి పిలునివ్వడంతో పోలీసులు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. మల్లారం గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా విపత్తు నివారణ చట్టాన్ని కూడా ఉపయోగిస్తామని స్పష్టం చేశారు.

అయితే రెండు పార్టీల నాయకులు కూడా మల్లారం వెళ్లేందుకు సమాయత్తం అవుతుండడంతో ఎక్కడివారిని అక్కడే పోలీసులు అరెస్ట్ చేశారు. మంథనిలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయన ఇంటి నుండి క్యాంప్ ఆఫీసుకు వెళ్లేందుకు బయటకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. అలాగే మంథని నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పోలీసులు కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్లకు తీసుకెళ్లారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇరు పార్టీల నాయకులను ఎక్కడికక్కడ నిలువరించారు. మరోవైపు మల్హర్ మండల రహదారి నుండి మల్లారం వరకు కూడా పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేపట్టారు.

Advertisement

Next Story