- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష.. టార్గెట్ సీఎం కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోనూ, రాష్ట్రంలో కరోనా, బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్నా వాటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ చికిత్సల కోసం ప్రజలు ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేధన వ్యక్తం చేశారు. సోమవారం కోవిడ్, బ్లాక్ ఫంగస్ చికిత్సను ప్రభుత్వం ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉత్తమ్ మాట్లాడారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య శ్రీలో కరోనా, బ్లాక్ ఫంగస్ చేర్చి ఎలాంటి ఖర్చు లేకుండా చికిత్సలు చేయాలని కోరారు.
ఇంట్లో దీపం ఆర్పేసి బయట దీపాలు పెట్టండి : భట్టి
గతేడాది దీపాలు పెట్టండి చప్పట్లు కొట్టండి అంటూ ప్రధాని చెప్పారు. ఇప్పుడు ఇంట్లో దీపం ఆర్పేసి బయట దీపాలు పెట్టండి అంటారని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇన్ని మరణాలకు కారణం సీఎం కేసీఆరే కారణమని ధ్వజమెత్తారు. శాసన మండలి, సభలో కరోనాని ఆరోగ్య శ్రీ లో చేర్చుతామని మాటిచ్చి.. 9 నెలలైన నేటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని, వ్యాక్సిన్ కూడా వేయకుండా ప్రజలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా దెబ్బ తిన్న కుటుంబాలకు ఉచిత వైద్యం,ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
మనసు లేని మృగం కేసీఆర్ : కోమటిరెడ్డి
మనసు లేని మృగంలా కేసీఆర్ ప్రవర్తిస్తున్నాడని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. ధనిక రాష్ట్రం అని చెప్పి పనికిరాని ప్రాజెక్టులకు ఖర్చు చేయడం కాదు. .కరోనా వైద్యం ఉచితంగా అందించండని హితవు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు చూపు లేకనే ఈ పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడం, నాయకులను కొనడం పైనే కేసీఆర్ దృష్టి ఉందని, కరోనాతో ఎంతోమంది చనిపోతున్న కేసీఆర్ కు పట్టింపులేదని కోమటిరెడ్డ మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి, పేదలకు ఉచితంగా చికిత్సలు అందించాలని డిమాండ్ చేశారు.
రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వండి : జీవన్ రెడ్డి
కరోనాకు ఉచితంగా వైద్యం అందించమంటే రక్త పరీక్షలు ఉచితంగా చేస్తామంటుందీ ప్రభుత్వం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసహానం వ్యక్తం చేశారు. కరోనా, బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్య శ్రీ లో చేర్చి ఉచితంగా వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. కరోనాతో రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ తో చనిపోయిన కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.
ఈ సత్యాగ్రహ కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, యూత్ అధ్యక్షుడు శివ సేనా రెడ్డి, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్, నాయకులు మర్రి శశిధర్ రెడ్డి, కోదండ రెడ్డి, మల్లు రవి, బొల్లు కిషన్, నగేష్ ముదిరాజ్, ఆడమ్ సంతోష్, ఫిరోజ్ ఖాన్, వినోద్ రెడ్డి, నిరంజన్, సోహైల్, సునీత రావ్, నూతి శ్రీకాంత్ మెట్టు సాయి తదితరులు పాల్గొన్నారు.