కేరళ సీఎం పై అవిశ్వాస తీర్మానం

by Shamantha N |
కేరళ సీఎం పై అవిశ్వాస తీర్మానం
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ రాజకీయాల్లో గోల్డ్ స్మగ్లింగ్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల రాజకీయ సెగ పుట్టేలా మరో సంచలనానికి తెరలేపారు. ఆగస్టు 24న సీఎం పినరయి విజయన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడుతామని హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా.. సీఎం గత నాలుగేళ్లుగా చేస్తున్నఅవినీతికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ రమేశ్ చెన్నితల డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో ఉత్కంఠ భరితంగా మారింది.

Advertisement

Next Story