మా ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిందే.. ఫెక్ల్సీలతో నేతల ర్యాలీ

by Sridhar Babu |   ( Updated:2021-07-29 06:55:48.0  )
Yellandu
X

దిశ, ఇల్లందు : ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ రాజీనామా చేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇల్లందు పట్టణంలోని కొత్త బస్టాండ్ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం చేరుకొని ఎమ్మార్వో కృష్ణవేణికి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా టీపీసీసీ మెంబర్ చీమల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గెలిచి అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు అని చెప్పుకునే ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే.. హుజురాబాద్‌లో ప్రవేశపెడుతున్న తెలంగాణ దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ఇల్లందులో కూడా అమలు చేస్తారని తెలిపారు.

ఎమ్మెల్యే రాజీనామా ద్వారా ఇల్లందు నియోజకవర్గంలో దళితులకు 10 లక్షల రూపాయల లోన్లు, కొన్ని సంవత్సరాలుగా ఇవ్వని రేషన్ కార్డులు, పింఛన్లు, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్‌లు దళితులకు మూడెకరాల భూమి ఇటువంటి ఎన్నో పథకాలు లభిస్తాయని అన్నారు. ఇల్లందు అభివృద్ధిని కోరి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన, బానోతు హరిప్రియ నాయక్ టీఆర్ఎస్ పార్టీలో చేరి, ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే నియోజకవర్గ ప్రజలు ఎంతో సంతోషిస్తారని అన్నారు.

నిజంగా నియోజకవర్గ అభివృద్ధిని కోరుకునే ఎమ్మెల్యే అయితే తన పదవికి వెంటనే ఆమె రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, మండల అధ్యక్షుడు పులి సైదులు, కాంగ్రెస్ నాయకులు సామ రాజ్, మోహన్, దామోదర్ రెడ్డి, పూనెం శ్రీరాములు, మహమ్మద్ ఖాన్, పట్టణ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి, రామకృష్ణ, ఈశ్వర్ గౌడ్, మైబూబ్, గోచి కొండ సత్యనారాయణ, కల్తీ వెంకటేశ్వర్లు, అజ్మీర రవి నాయక్, ధనసరి రాజు, రమేష్ నాయక్, నారాయణ చౌదరి, మధు, రమాదేవి, వేణు, గంగావతి రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ముత్తిరెడ్డి గారూ.. రాజీనామా చేయండి.. అభివృద్ధికి సహకరించండి

Advertisement

Next Story

Most Viewed