- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగారు తెలంగాణ అని.. అనారోగ్య తెలంగాణగా మారుస్తున్రు
దిశ, షాద్ నగర్: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ప్రగల్భాలు పలికిన టీఆర్ఎస్ నాయకులు కరోనా వైరస్ తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పట్టించుకోకుండా రాష్ట్రాన్ని అనారోగ్య తెలంగాణగా మారుస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘స్పీక్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో టీపీసీసీ చేపట్టిన ఆన్‌లైన్ ఉద్యమం కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కాంగ్రేస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇస్తున్న సలహాలు, సూచనలు స్వీకరించకుండా ప్రశ్నించే గొంతుకలను ఇబ్బందులకు గురిచేస్తూ తాను చెప్పిందే శిరోధార్యం అనే రీతిలో ముఖ్యమంత్రి పాలన సాగుతోందన్నారు. కాంగ్రెస్ శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేపట్టిన స్పీక్ ఆఫ్ తెలంగాణ లో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు, వ్యాపార, వాణిజ్య వర్గాలకు చెందినవారు భాగస్వాములు కావాలని కోరారు. కరోనా వచ్చిన అందరికి గాంధీ ఆసుపత్రిలోనే వైద్యం అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వారి ఎమ్మెల్యేలు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారంటే ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సివస్తుందన్నారు.