- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్సర్ బైక్‌ను హుస్సేన్ సాగర్‌లో వేసిన కాంగ్రెస్ నేత
దిశ, వెబ్‌డెస్క్ : రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా శుక్రవారం ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో యూత్ కాంగ్రెస్ నాయకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. యూత్ కాంగ్రెస్ నేత శైలేందర్‌తో కలిసి కాంగ్రెస్ నాయకులు ట్యాంక్ బండ్ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న పల్సర్ బైక్ ను హుస్సేన్ సాగర్ లో వేసి నిరసన చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దేశవ్యాప్తంగా గడిచిన 13 నెలల్లో పెట్రోల్‌పై రూ.25.72, డీజిల్‌పై 23.93 రూపాయలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని మండిపడ్డారు. చమురు ధరలు పెరుగుదలతో దేశ వ్యాప్తంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశానంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు కరోనా, లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను తమ ఇష్టానుసారంగా పెంచుకుంటుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని యూత్ కాంగ్రెస్ నేత శైలేందర్ డిమాండ్ చేశారు.