బహిరంగా చర్చకు రమ్మంటే.. పారిపోతున్నారు

by Shyam |   ( Updated:2020-08-06 09:26:27.0  )
బహిరంగా చర్చకు రమ్మంటే.. పారిపోతున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడయాతో మాట్లాడుతూ… కరోనాపై సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాని వన్నీ తప్పుడు లెక్కలేనని ఆరోపించారు. కేబినెట్‌ సమావేశంలో ప్రాధాన్యత గల అంశాలను చర్చించకుండా, అనవసర విషయాలను చర్చించారని విమర్శించారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఐటీ విస్తరణ అంటున్న కేసీఆర్.. ఐటీఐఆర్, యానిమేషన్ హబ్ ఏమైందో చెప్పాలన్నారు. కేసీఆర్ అదనంగా ఒక్క ఎకరాకైనా నీరు ఇచ్చారా? అని పొన్నాల ప్రశ్నించారు. 24గంటల విద్యుత్‌, ప్రాజెక్టుల ద్వారా నీరిస్తే పంటల ఉత్పత్తి ఎందుకు పెరగలేదని నిలదీశారు. ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రమ్మంటే పారిపోతున్నారని పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed