- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర ప్రమాదం.. కారు యాక్సిడెంట్‌లో కాంగ్రెస్ నేతకు గాయాలు
దిశ, జగిత్యాల : జిల్లాలోని ధర్మపురి రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
అయితే, ఈ ప్రమాదంలో అడ్లూరి లక్ష్మణ్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. వివరాల ప్రకారం.. లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న వాహనాన్ని, దండపెల్లి చెందిన యువకులు.. స్విఫ్ట్ డిజైర్ కారుతో ఓవర్ స్పీడ్‌లో ఢీకొట్టారు. ఈ క్రమంలో లక్ష్మణ్ కుమార్ వాహనం పూర్తిగా దెబ్బతిన్నది.
ధర్మపురిలో జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభను ముగించుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ద్వారా తెలిసింది. కాగా ఈ వాహనంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు వెల్గటూర్ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలెందర్ రెడ్డి ఉన్నారు. అలాగే స్విఫ్ట్ డిజైర్ వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.