- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘అడ్డగోలుగా మాట్లాడకు.. అసలు నువ్వు మంత్రివేనా’
దిశ, వెబ్ డెస్క్: అధికార టీఆర్ఎస్ మంత్రులపై, కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర మంత్రులు అడ్డగోలుగా మాట్లాడకుండా, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, అసలు మంత్రివేనా నువ్వు అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు ఎక్కువ భజన చేయడం కూడా మంచిది కాదని హితవు పలికారు. రాజకీయాలు హుందాగా ఉండాలని, తాము హెరిటేజ్ బిల్డింగ్ కూల్చొద్దని మాత్రమే చెప్పామని, హాస్పిటల్ కట్టొద్దని తాము ఏనాడూ అనలేదని స్పష్టం చేశారు. ఉస్మానియా హాస్పిటల్ పక్కనున్న ఖాళీ ప్లేస్‌లో కట్టాలని కోరామని, కానీ తాము అడ్డుకున్నట్టు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పక్కనున్న ఖాళీ ప్రదేశంలో కడతామని సీఎం కేసీఆర్ అన్నారని, ఇప్పటివరకూ ఎందుకు కట్టలేదని దుయ్యబట్టారు. ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని హనుమంతరావు తప్పుబట్టారు.