- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దమ్ముందా..? బండి సంజయ్, కేటీఆర్‌కు దాసోజు శ్రవణ్ సవాల్
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఐటీఐఆర్ విషయంలో బండి సంజయ్ మంత్రి కేటీఆర్‌లు లేఖలు రాసుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఇద్దరివీ దొంగ డ్రామాలే అని ఎద్దేవా చేశారు. నూతన వ్యవసాయ చట్టాలకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది కానీ.. ఐటీఐఆర్ విషయంలో ఎందుకు అడగడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా బీజేపీ ఎంపీలు సైతం ఐటీఐఆర్‌పై కేంద్ర ఐటీశాఖ మంత్రిని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. దమ్ముంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఐటీఐఆర్ కోసం ధర్నాకు రావాలి అని సవాల్ విసిరారు. అంతేగాకుండా ఐటీఐఆర్ కోసం భూములున్నాయి.. డీపీఆర్ కూడా ఉంది అని గుర్తుచేశారు. రూ.13 వేల కోట్లు ఎవరు కేటాయిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వమే కేటాయించాలని అన్నారు.