కాంగ్రెస్ కౌన్సిలర్లు నల్లబ్యాడ్జీలతో నిరసన.. ఎందుకంటే?

by Shyam |
కాంగ్రెస్ కౌన్సిలర్లు నల్లబ్యాడ్జీలతో నిరసన.. ఎందుకంటే?
X

దిశ, మెదక్: నారాయణఖేడ్ మున్సిపల్ సాధారణ సమావేశానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు నల్లబ్యాడ్జీలతో హాజరయ్యారు. ఇటీవల రిపోర్టర్ పరమేశ్‌కు చెందిన ఇంటిని కూల్చివేసినందుకు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం పరమేశ్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించి.. న్యాయం జరిగే వరకు పోరాడుతామని భరోసా ఇచ్చారు. అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే బెదిరింపులు, పోలీసు కేసులు పెడతారా అంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రశ్నించారు. రిపోర్టర్ పరమేశ్ అధికార పార్టీ నేతల ఇసుక అక్రమ రవాణా సంబంధించిన వార్త రాయడంతో అతన్ని ఇంటిని కూలగొట్టినట్లు కాంగ్రెస్ కాన్సిలర్లు ఆరోపించారు.

Advertisement

Next Story