ఖాతా తెరిచిన కాంగ్రెస్..

by  |   ( Updated:2020-12-04 01:51:49.0  )
ఖాతా తెరిచిన కాంగ్రెస్..
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : ఉప్పల్ నియోజకవర్గంలోని ఏఎస్ రావు నగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్ధి పావని రెడ్డిపై ఉన్న వ్యతిరేకతే కాంగ్రెస్‌కు కలిసి వచ్చిందని స్థానిక నేతలు చెబుతున్నారు.

ఈ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే అంచనాలు లేవని వారు అభిప్రాయం వ్యక్తంచేశారు. కానీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రోత్సహంతోనే కాంగ్రెస్ అభ్యర్ధిని బరిలోకి దించినట్లు చెప్పారు. శిరీషా రెడ్డి గెలుపుతో హస్తం నేతల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.

Advertisement

Next Story