- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షర్మిల వైపు చూస్తున్న కాంగ్రెస్ క్యాడర్..
దిశ, భద్రాచలం : కాంగ్రెస్ పార్టీలో నాయకుల తీరు నచ్చడం లేదు. అధికార పార్టీలో చేరడం ఇష్టంలేదు. బీజేపీ వైఖరి బాగాలేదు. రాష్ట్రంలో వామపక్షాలకు జనాదరణ లేదు. అందుకే త్వరలో షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ వైపు చూస్తున్నట్లు కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. రాజన్న రాజ్యమే తెలంగాణలో టీఆర్ఎస్‌కి ప్రత్యామ్నాయమని కూడా కొందరు కాంగ్రెస్ శ్రేణులు నమ్ముతున్నారు. అందుకే షర్మిల వైపు అడుగులు వేయడానికి సిద్ధమౌతున్నారు. ముఖ్యంగా రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి షర్మిల పార్టీలో చేరడానికి సమాయత్తం అవుతున్నట్లుగా సమాచారం.
కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు అధికమైందని, ఎన్నికల్లో వరుస ఓటములు తగులుతున్నా నాయకుల వైఖరిలో మార్పు కనిపించడంలేదని, నాయకుల తీరు ఇలాగే ఉంటే ఇక తెలంగాణలో పార్టీ మనుగడ కష్టమని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
అసంతృప్తి నేతల చూపు.. షర్మిల వైపు
వివిధ పార్టీలలోని అసమ్మతి నాయకులు షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ వైపు చూస్తున్నారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతం అందరి చూపు బీజేపీ వైపు మరలింది. అయితే హిందుత్వ పద ప్రయోగం తెలంగాణలో బీజేపీకి అంతగా లాభం చేకూర్చలేకపోతోంది. దానికితోడు క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకొనే కమలం పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకముందే చాలా మండలాల్లో నాయకత్వ విభేదాలు, గ్రూపులతో సతమతమవుతున్న కారణంగా తెలంగాణలో ఆ పార్టీ బలపడటం అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి ముచ్చెమటలు పట్టించిన తీన్మార్ మల్లన్న పార్టీ పెడితే అందులోకి జంప్ చేద్దామని ఎదురుచూసిన వారంతా పార్టీ పెట్టడంలేదని తీన్మార్ మల్లన్న ప్రకటించడంతో తీవ్ర నిరాశచెందారు. రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఇప్పటికే అసంతృప్తి వాదులంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార టీఆర్ఎస్ సహా వివిధ పార్టీలలో అసంతృప్తి నేతలకు షర్మిల పార్టీ నేతలు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు ఇటీవల భద్రాచలం నియోజకవర్గంలో పర్యటించి అసంతృప్తులతో మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం.
టిక్కట్ హామీ లభిస్తే అనుచరగణంతో కలిసి అధికార పార్టీ నుంచి వైదొలగి వచ్చేస్తామని కీలక నేతలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు ఈనెల 30 లేదా 31 తేదీలలో షర్మిలతో సమావేశం కావడానికి జిల్లా నాయకులు అపాంట్‌మెంట్ తీసుకున్నట్లు సమాచారం.