- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సివిల్ సప్లయ్ శాఖలో గందరగోళం
దిశ, తెలంగాణ బ్యూరో: సివిల్ సప్లయ్ శాఖలో గందరగోళ పరిస్థితి కారణంగా ప్రభుత్వానికి తల ఒంపులు వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం వేల కోట్లు కేటాయించినా కొనుగోళ్లలో జాప్యం, సమస్యల కారణంగా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. శాఖలోని ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం, సమస్యల కారణంగా అటు శాఖ, ఇటు ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు సహా శాఖ విషయాల్లో అన్ని తానై చైర్మన్ వ్యవహిరిస్తుండగా.. ఆ బాధ్యతలు చూడాల్సిన కమిషనర్ నిమిత్తమాత్రంగానే మిగిలిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
యాసంగి సీజన్‌లో ధాన్య కొనుగోళ్లకు ప్రభుత్వం రూ.20 వేల కోట్లను శాఖకు అప్పగించినప్పటికీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కమిషనర్ నిర్వహించాల్సిన పనులను కూడా శాఖ చైర్మన్ నిర్వహిస్తుండటం గమనార్హం.. వ్యవసాయ మంత్రి కూడా సివిల్ సప్లైలోకి అడుగుపెట్టి జాయింట్ కలెక్టర్లు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఏ శాఖకైనా నిర్ణయాధికారిగా ఉంటారు. కమిషనర్ ఏ దస్త్రంపై సంతకం పెడితే అది జీఓగా మారుతుంది.
కానీ పౌరసరఫరాల శాఖ కమిషనర్ మాత్రం శాఖపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో గన్ని సంచుల నుంచి వాటి టెండర్లతో పాటు కొనుగోళ్లలో కూడా ఆయన పాత్ర ఏమీ లేదన్నట్టుగా వ్యవహరించడం శాఖ పెద్దలను సైతం ఆశ్చర్యపరిచింది. శాఖకు సంబంధించిన ఏ అంశంలోనూ అంటిముట్టన్నట్టుగా ఉంటున్నారనే విమర్శ లొస్తున్నాయి. మిగతా అధికారులు కూడా ఈ వ్యవహారాలను చర్చించుకోవడం గమనార్హం. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సమీక్షలు కమిషనర్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆయన స్పందించకపోవడంతో సమావేశాలన్నీ పౌరసరఫరాల చైర్మన్ తో కలిసి మంత్రులు నిర్వహించారు.
ఇన్‌చార్జీ కమిషనర్ కావడమే కారణమా
కొనుగోళ్ల అంశమే కాకుండా శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ కమిషనర్ అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రభావం సంస్థపై పడుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్ని సంచులు సమకూర్చడం, రవాణా సౌకర్యంతో మిల్లుల కేటాయింపు చేయడంలోనూ నిర్లక్ష్యం వహించినట్టు ఆరోపణలు వినబడుతున్నాయి. మిల్లర్లపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల వారంతా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని సమాచారం. కమిషనర్ స్థాయిలో మిల్లర్లపై వస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకుంటే రైతులకు ఇబ్బందులు తగ్గించిన పేరు శాఖకు దక్కుతుండేది. దేవాదాయ శాఖకు కూడా ఆయనే కమిషనర్‌గా ఉండడంతో పాటు సివిల్ సప్లయ్ శాఖకు ఇన్‌చార్జీ కమిషనర్‌గా రెండు బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ధాన్యం కొనుగోళ్లలో ప్రధాన పాత్ర కమిషనర్ దే. ఆయన పట్టించుకోకపోవడంతో చైర్మన్ స్వయంగా జేసీలతో సమీక్షలు నిర్వహించి, మిల్లరపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే చర్యలకు కమిషనర్ నిర్ణయమే ఆధారం కావడంతో చైర్మన్ ఏమీ చేయలేకపోతున్నారు. మిల్లర్లలో ఎవరు ఎంత ధాన్యం కొనుగోళ్లు చేసిన ఎక్కడికో తరలించారో, అనుకున్న సమయానికి కొనుగోళ్లు పూర్తి చేయకున్నా శాఖపరమైన చర్యలు శూన్యంగానే మారిపోయాయి. ధాన్యం కొనుగోళ్ల సమయంలో జిల్లా స్థాయిలోనే మంత్రి సమావేశాలకు పరిమితమవుతున్నారు తప్ప పూర్థిస్థాయిలో శాఖకు సమయం కేటాయించలేకపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా మంత్రి శాఖపై దృష్టిపెట్టి.. కమిషనర్ వ్యవహరశైలిపై దృష్టి సారించి శాఖకు అంటుకున్న నిర్లక్ష్యపు వ్యాధికి చికిత్స చేస్తే తప్ప శాఖ గాడిలో పడేలా కనిపించడం లేదు.