టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం.. పోలీసుల లాఠీచార్జి

by Shyam |   ( Updated:2023-07-03 09:36:09.0  )
టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం.. పోలీసుల లాఠీచార్జి
X

దిశ, అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలో ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం వద్ద అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ సందర్భంగా అధికార పార్టీకి చెందిన నాయకులు ఓటర్లను ఆకర్షితులను చేసేందుకు కుట్రలు చేస్తున్నారని.. బీజేపీకి చెందిన నాయకులు ఆరోపణలు చేస్తూ వాగ్వాదానికి దిగారు. ఇలా రెండు సార్లు.. ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ తోపులాటకు దిగారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని ఇరు పార్టీల నాయకులను తరుముతూ స్వల్ప లాఠీచార్జి చేశారు. గొడవలు తీవ్రతరం కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

Advertisement

Next Story