- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లాక్ ఫంగస్ కు ఈఎన్‌టీలో పూర్తిస్థాయి చికిత్సలు
దిశ, తెలంగాణ బ్యూరో: బ్లాక్ ఫంగస్ కేసులు పెరగడంతో కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో చికిత్సలందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఆసుపత్రిలో తొలుత 50 బెడ్లలో మాత్రమే చికిత్సలకు అనుమతులిచ్చిన ప్రభుత్వం ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా మొత్తం 202 బెడ్లను బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు వినియోగించేందుకు చర్యలు చేపడుతున్నారు. అంచనాలకు మించి పేషెంట్లు బ్లాక్ ఫంగస్ వ్యాధితో ఈఎన్‌టీ ఆసుపత్రికి తరలుతున్నారు. రాష్ట్రంతో పాటు ఏపీకి చెందిన పేషెంట్ల తాకిడి ఈఎన్‌టీ ఆసుపత్రికి పెరిగింది. ప్రస్తుతం ఈఎన్‌టీ ఆసుపత్రిలో 90 మంది చికిత్సలు పొందుతుండగా మరో 70 మంది వరకు గాంధీ, ఇతర ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేషెంట్లకు సరైన చికిత్సలందించేందు ఈఎన్‌టీ హాస్పిటల్‌ను పూర్తి స్థాయి నోడల్ కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆసుపత్రిలో ఇతర సేవలను నిపివేసి బ్లాంక్ ఫంగస్ చికిత్సలకు ప్రత్యేక ఆసుపత్రిగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఆసుపత్రి వర్గాలు కావాల్సిన సదుపయాల ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
ఈఎన్‌టీ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ చికిత్సలకు బెడ్లు, మందులు, ఇంజక్షన్ల కొరత తీవ్రంగా ఉంది. కరోనా నుంచి కోలుకున్న పేషెంట్లు అధిక సంఖ్యలో బ్లాక్ ఫంగస్ బారిన పడుతుండటంతో మరింత మంది పేషెంట్లు చికిత్సల కోసం వచ్చే అవకాశముందని ఈఎన్‌టీ ఆసుపత్రి సిబ్బంది అంచనా వేసారు. ప్రస్తుతం కరోనా సోకిన వారిలో 1 శాతం మందిలో మాత్రమే బ్లాక్ ఫంగస్ వస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. సెకండ్ వేవ్‌లో అత్యధికంగా పేషెంట్లకు స్టెరాయిడ్స్ వినియోగించడం వలనే బ్లాక్ ఫంగస్ వ్యాధి ఉత్పన్నమవుతుందని డాక్టర్లు విశ్లేషించారు. ఈ వ్యాధి నివారణకు అవసరమైన మందులను ప్రభుత్వం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా అందిస్తుండటంతో ఇప్పటి వరకు ఈ మందుల కోసం 700 మంది దరఖాస్తులు చేసుకున్నారు. లింపోసోమల్ ఆంఫోటెరిసిన్ బి, పోసాకానాజోల్, ఇసావుకానజోల్ వంటి మందులు బ్లాక్ మార్కెట్‌కు తరలివెళ్లకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది.
నోటిఫయబుల్ వ్యాధిగా బ్లాక్ ఫంగస్
బ్లాక్ ఫంగస్ వ్యాధి ఎపిడమిక్ డిసీస్ యాక్ట్ 1897 ప్రకారం నోటిఫయుబుల్ వ్యాధిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ వ్యాధికి సరిపడా చికిత్సలందించేందుకు తగిన ఏర్పాట్లను చేసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు మార్గదర్శకాలను అందజేశారు. ఫంగస్‌ను గుర్తించేందుకు స్క్రీనింగ్, అవసరమైన డయగ్నోస్టిక్స్‌ను ఉపయోగించాలని సూచించింది. ప్రతి రోజు నమోదవుతున్న కేసుల వివరాలను వైద్యశాఖకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు.