డిచ్‌పల్లి రైల్వేస్టేషన్ నుంచి సరుకు రవాణా ప్రారంభం

by Shyam |   ( Updated:2021-04-02 11:51:39.0  )
డిచ్‌పల్లి రైల్వేస్టేషన్ నుంచి సరుకు రవాణా ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా ఆహార ధాన్యలు,ఎరువుల రవాణాకు దక్షిణ మధ్య రైల్వే డిచ్‌పల్లిలో గూడ్స్ షెడ్ ఏర్పాటుచేసింది. ఇదివరకు నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రవాణా జరిగేది.కానీ స్టేషన్ వద్ద లోడింగ్ కి సంబంధించిన రద్దీని నివారించేందుకు ప్రత్యాన్మాయంగా రైల్వే శాఖ ఈ గూడ్స్ షెడ్ ని అభివృద్ధి చేసింది. అంతేకాకుండా వినియోగదారులు డిచ్‌పల్లి లో సరుకు లోడింగ్ చేస్తే వారికి ప్రతి టన్నుపై రూ.20 టెర్మినల్ చార్జీని మినహాయించారు. ఈ స్టేషన్ నుంచి బుధవారం 2,670 టన్నుల బియ్యంతో రేక్ కేరళ రాష్ట్రంలోని ముగున్నతుకావులో గల ఎఫ్‌సీఐ కి రవాణా చేయగా అది గురువారం గమ్యస్థానానికి చేరుకుంది.

= నిత్యం ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సరకు రవాణా ని డిచ్‌పల్లి కి తరలించాలని స్థానిక వినియోగదారులు చాలా కాలంగా డిమాండ్ చేశారు. నిజామాబాద్ లో గూడ్స్ ట్రాఫిక్ సమస్యలతో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించాలని రైల్వే శాఖకి విన్నవించారు. దీనికి స్పందించిన రైల్వే శాఖ జనవరి 2021లో డిచ్‌పల్లిలో ఏర్పాటుచేయాలని రైల్వే నిర్ణయించింది. దీనికోసం డిచ్‌పల్లిలో అదనంగా లోడింగ్ కి సౌకర్యవంతంగా ఉండేలా కావాల్సిన అప్రోచ్ రోడ్డు, భవన నిర్మాణం, వాహనాల రాకపోకలకు రోడ్డు, లోడింగ్ అన్ లోడింగ్ కి కోసం సరుకు స్టోరేజీకి కావాల్సిన స్థలం వంటి పనులను వేగంగా అభివృద్ధి చేశారు. నిజామాబాద్‌కు ప్రత్నామ్నాయంగా డిచ్‌పల్లిలో గూడ్స్‌ షెడ్‌ ను ఏర్పాటుచేయడంపై రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. నెలకు 4 రేక్ ల వరకు లోడింగ్‌ చేస్తామని సరుకు రవాణా వినియోగదారులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం డిచ్‌పల్లి సమీప ప్రాంతంలో 10,000 టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు అందుబాటులో ఉన్నాయి. దీన్ని భవిష్యత్తులో 50,000 టన్నుల సామర్థ్యం వరకు పెంచే అవకాశాలున్నాయి.

= ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మ్యా స్థానిక సరుకు రవాణా వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా డిచ్‌పల్లి వద్ద ప్రత్యామ్నాయ గూడ్స్‌ షెడ్‌ అభివృద్ధికి కృషి చేసిన హైదాబాద్‌ డివిజన్‌ బృందాన్ని అభినందించారు. ఇక్కడ ఏర్పాటుచేసిన సౌకర్యాలను వినియోగించుకోవాలని ఆయన సరుకు రవాణా వినియోగదారుకు సూచించారు. సరుకు రవాణా కోసం స్థానిక వ్యాపారస్తులతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతూ వారి అవసరాలను తీర్చాలని ఆయన అధికారులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed