‘డబుల్’ ఆఫర్స్.. దళారులను నమ్మొద్దు : శ్వేతా మహంతి

by Shyam |
‘డబుల్’ ఆఫర్స్.. దళారులను నమ్మొద్దు : శ్వేతా మహంతి
X

దిశప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం లబ్ధిదారులు దళారులను నమ్మి మోసపోవద్దని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. అందుకోసం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రభుత్వమే పూర్తి ఉచితంగా, అర్హులైన వారికి మాత్రమే ఇస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు.

జియాగూడ, గోడేకీ కబర్, కట్టెల మండిల్లో మిగిలిన ఇండ్లు, దుకాణాలను ఇప్పిస్తామని వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు కలెక్టర్ తెలిపారు. ఇండ్లు లేని పేదలకు మాత్రమే డబుల్ ఇళ్లు ఇస్తారని, జియాగూడలో మంత్రి కేటీఆర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఎవరైనా మధ్యవర్తులు ఇళ్ల విషయంలో మోసం చేస్తే తన దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా క్రిమినల్ కేసులు పెట్టిస్తామని కలెక్టర్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed