ఇంటికో ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలి

by Shyam |
ఇంటికో ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలి
X

దిశ, నిజామాబాద్: వానాకాలం సమీపిస్తున్నందున ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిధిలో ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఎ.శరత్ కుమార్ అన్నారు. జిల్లాలోని సదాశివనగర్ మండలం మరికల్ తిరుమనుపల్లి గ్రామాల్లో గురువారం పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. వానాకాలంలో అతిసార, డెంగ్యూ వంటి వ్యాధులు రాకుండా చూడాలని గ్రామాధికారులను కోరారు. గ్రామాల్లోని పారిశుధ్యం కార్యక్రమాలను మెరుగుపరచాలని సంబంధిత అధికారులను సూచించారు.అదేవిధంగా నర్సరీల్లో మొక్కలు పెంచాలన్నారు. గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనంతో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనే విధంగా చూడాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం వలన భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయని తెలిపారు. స్మశాన వాటిక పనులు పూర్తి చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. అలాగే గ్రామ హరిత ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. కుంటల చుట్టూ మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, జిల్లా శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, డీపీవో సాయన్న, ఎంపీడీవో అశోక్, ఎంపీడీవో సతీష్ కుమార్, సర్పంచులు సంగారెడ్డి, బాల్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed