- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులు సంతోషంగా ఉన్నారు : కలెక్టర్ నిఖిల
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: యాసంగి సీజన్‌లో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు పండించుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల రైతులను కోరారు. పూడూర్ మండలంలో పీఏసీఎస్ ద్వారా నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలును సక్రమంగా నిర్వహించటం జరుగుతోందని, ఇందుకు రైతులు కూడా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ యాసంగి సీజన్‌లో రైతులు ఉత్పత్తి చేసిన వరిధాన్యాన్ని భారత ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా కొనడం లేదని అన్నారు.
యాసంగి సీజన్‌లో కొనుగోలు కేంద్రాలు సైతం ఉండవని స్పష్టం చేశారు. అనవసరంగా వరి పంటలు వేసి రైతులు నష్టపోవద్దని తెలిపారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకొని లాభం పొందాలన్నారు. ఆరుతడి పంటలు పండిస్తే భూసారాన్ని రక్షించుకోవచన్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంటసాగు చేసి అధిక లాభాలు పొందవచ్చాన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులతో రైతులకు ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై సూచనలు, సలహాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.