- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ ఇన్‌స్పెక్షన్.. సమయానికి లేని డాక్టర్లు, సిబ్బంది
దిశ, ములుగు: సమయానికి విధులకు హాజరుకాకపోతే చర్యలు తప్పవని ములుగు వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. వైద్యులు, సిబ్బంది అనుమతి లేకుండానే గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన, మారుమూల ప్రాంతంలో సమయానికి అందుబాటులో ఉండాల్సిన డాక్టర్లు.. మధ్యాహ్నం 12 గంటలు కావొస్తున్న విధులకు హాజరుకాకపోవడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ స్వయంగా అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించి విధులకు గైర్హాజరు అయిన డా.ఎ.మల్లయ్య, ఎ. చెంద్ర శేఖర్, వేణు ప్రసాద్, అనిల్ కుమార్, సిబ్బందికి ఒక రోజు వేతనం నిలిపివేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ తీరుకు జిల్లా వైద్యాధికారి డా. అప్పయ్య పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇక మీదట ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకోవాలని గట్టిగా మందలించారు.