- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గోదావరి ముంపులో.. లాంచీపై కలెక్టర్ పర్యటన
దిశ, కుక్కునూరు : వేలేరుపాడు మండలంలో గోదావరి వరద ముంపునకు గురైన ప్రాంతాన్ని సోమవారం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పరిశీలించారు. తాట్కూరుగొమ్ము నుంచి లాంచీపై కలెక్టర్ వరద చుట్టిన కట్కూరు, కోయిదా, ఏడవల్లి, చిగురుమామిడి, కాకిస్‌నూరు గ్రామాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడుతూ.. వరద నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నిర్వాసితులకు అండగా ఉంటామని..ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కోయిదా గ్రామానికి గురువారం నాటికి బిల్ పాస్ చేసి యుద్ధప్రాతిపదికన పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. ఇంటింటికి వెళ్లి ఎంతో ఓపికగా నిర్వాసితుల బాగోగులను అడిగితెలుసుకున్నారు.
పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. గర్భిణీలకు పౌష్టికాహారంలో అలసత్వం వహిస్తే 24 గంటల్లో చర్యలు తప్పవని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. అనంతరం లాంచీలో పోలవరం కాఫర్ డ్యాం వరదను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేఆర్‌పురం ఐటీడీఏ పీవో ఓ. ఆనంద్, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్నలక్ష్మీ, డీఎస్పీ శ్రీలతాకుమారి, కుక్కునూరు సీఐ దుర్గాప్రసాద్, ఎమ్మార్వోలు చెల్లన్న దొర, సుమతి, ఎస్ఐ సాధిక్ తదితరులు పాల్గొన్నారు.