ఇండియన్ – 2 నిర్మాత, కమల్ మధ్య కోల్డ్ వార్

by Shyam |
ఇండియన్ – 2 నిర్మాత, కమల్ మధ్య కోల్డ్ వార్
X

లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ, విశ్వనటుడు కమల్ హాసన్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ‘ఇండియన్ -2’ సినిమా స్పాట్‌లో ప్రమాదం జరగడంతో షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం ఈ కేసులో చిత్రబృందాన్ని విచారిస్తున్నారు పోలీసులు. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మాత సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా… షూటింగ్ ఆగిపోవడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. అంతకు ముందు కమల్ హాసన్ హీరోగా ‘శభాష్ నాయుడు’ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. అయితే ‘ఇండియన్ 2’ కూడా మధ్యలో ఆగిపోవడం… నిర్మాణ సంస్థ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కమల్ చెప్తుండడంతో నిర్మాత కోపంగా ఉన్నారట. దీంతో ఇద్దరికి పడట్లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో షూటింగ్ ఆగిపోవడం కాదు… ‘ఇండియన్ -2’ ప్రాజెక్టే పూర్తిగా ఆగిపోయేలా ఉందని కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Tags: Indian 2, Kamal Hassan, Lyca Production, Subhaskaran

Advertisement

Next Story