- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
1500 పైగా ఐసోలేషన్ బెడ్లు సిద్ధం : కోల్ ఇండియా!
దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్య రంగం మరింత పటిష్ఠంగా ఉండాలి. ఇప్పటికే అనేక సంస్థలు వైద్య రంగానికి అవసరమైన సాయాన్ని అందిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా అనుబంధ సంస్థలు దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో 1509 ఐసోలేషన్ పడకల్ని ఏర్పాటు చేశామని వెల్లడించాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేశారు.
మొత్తం 1509 పడకలలో కోల్ ఇండియా అనుబంధ సంస్థ మహానది కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ ఓడిశాలోని పలు ప్రదేశాలలో 664 బెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే, నార్తర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో 200 ఐసోలేషన్ బెడ్లను ఏర్పాటు చేయనున్నారు. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ 100 బెడ్లను, సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ 180 బెడ్లను, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ 144 బెడ్లు, సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ 132 బెడ్లు, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ 75 బెడ్లు, నార్త్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ 14 బెడ్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు బొగ్గు గనుల్లో పనిచేసే వారికి, చుట్టుపక్కల నివశించే ప్రజలకు ఈ అనుబంధ సంస్థల ద్వారా సుమారు 3.3 లక్షల ఫేస్ మాస్కులు పంపిణీ చేశామని ఓ అధికారి తెలిపారు.
ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ అధికంగా 76,367 మాస్కులను పంపిణీ చేసింది. నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ 66,847 మాసుకులు, నార్త్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ 64,536, వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ 52,613 మాస్కులను పంపిణీ చేశాయి. కరోనా మహమ్మారిని నిలువరించేందుకు కోల్ ఇండియా లిమిటెడ్ పీఎమ్ కేర్స్ సహాయనిధికి రూ. 220 కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలో సుమారు 80 శాతం వాటా కలిగిన కోల్ ఇండియా లిమిటెడ్‌లో ఎంతోమంది ఉద్యోగులున్నారు. వారందరికీ రక్షణ కల్పిస్తామని సంస్థ తెలిపింది.
Tags : Coal CIL, CIL, CIL Susbsidiaries, Mahanadi Coalfields Ltd, MCL, Coal India Coronavirus